4 నుండి 5 వారాల మధ్య
మెదడు వేగంగా పెరగడాన్ని కొనసాగిస్తూ
5 విలక్షణ భాగాలుగా విభజించుకుంటుంది.
పిండం మొత్తం పరిమాణంలో తల 1/3 భాగం ఉంటుంది.
సెరిబ్రల్ హెమిస్పియర్లు బహిర్గతమై
క్రమంగా మెదడు లోని అతిపెద్ద భాగాలుగా తయారవుతాయి..
సెరిబ్రల్ హెమిస్పియర్లు అంతిమంగా నియంత్రించే పనులలో
ఆలోచన, నేర్చుకోవడం,
జ్ఞాపకం, మాటలు, చూపు,
వినికిడి, స్వచ్ఛంద కదలిక
మరియు సమస్యా పరిష్కారము ఉంటాయి.