ఇంతకు ముందు చూసినట్లు నోటి దగ్గర ప్రేరణ జరిగితే
వెనుక్కు ముడుచుకునే ప్రతిస్పందనకు భిన్నంగా
ప్రేరేపించిన వస్తువు వైపు మళ్ళడం మరియు
నోరు తెరవడం ద్వారా ప్రతిస్పందనలుంటాయి..
ఈ ప్రతిస్పందనను "రూటింగ్ రెస్పాన్స్" అంటారు.
ఇది జననం తరువాత కూడా కొనసాగుతుంది,
నవజాత శిశువు పాలు త్రాగే సమయంలో
తల్లి చనుమొనలను
వెతుక్కోవడానికి ఉపయోగపడుతుంది.