16 వారాల సమయంలో గర్భస్థ శిశువు ఉదరంలోకి
సూదిని చొప్పించే పద్ధతిని ప్రయోగిస్తే
ఒత్తిడి ప్రభావానికి స్పందించే హార్మోనుల విడుదల
ప్రక్రియ వెంటనే ప్రారంభమై
నొరాడ్రెనలైన్
లేదా నొరాపైనేఫ్రైన్ అనే హార్మోను
రక్త ప్రవాహంలోకి విడుదల అవుతుంది.
అప్పుడే పుట్టిన శిశువులు మరియు పెద్దలు ఇద్దరూ
దాడికి గురి అయిన పరిస్థితులలో ఒకే రకంగా స్పందిస్తారు.