6 వారాలకు,
ప్రస్తుతం లింఫోసైట్లు ఉన్న కాలేయంలో
రక్త కణాల నిర్మాణం కొనసాగుతుంటుంది.
ఈ రకపు తెల్ల రక్త కణం
అభివృద్ధి చెందే రోగ రక్షణ వ్యవస్థకు కీలక భాగం.
Chapter 22 The Diaphragm and Intestines
డయాఫారమ్,
అంటే ఊపిరి పీల్చుకోవడానికి ఉపయోగించే
ప్రధాన కండరం,
చాలా వరకు 6 వారాలకు రూపొందుతుంది.
పేగులలోని ఒక భాగము తాత్కాలికంగా
బొడ్డు నాళంలోకి చొచ్చుకొని వస్తుంది.
ఫిజియో లాజిక్ హెర్నియేషన్ అని పిలువబడే ఈ సాధారణ ప్రక్రియ
అభివృద్ధి చెందే ఇతర అవయవాలకు ఉదరంలోపల స్థానాన్ని కల్పిస్తుంది.